Monday, 10 August 2015

పెళ్ళంటే నూరేళ్ళ పంట..

పెళ్ళంటే నూరేళ్ళ పంట.. ఒద్దంటే వదిలి వెళ్ళిపోవడానికి స్నేహం కాదు. కడదాకా తోడుంటాను అని ప్రమాణం చేసి తాళి కట్టి దేవతల సాక్షిగా, బంధువుల సాక్షిగా ఒక్కటైన విడదీయరాని అపూర్వబంధం.. దీనిని ఆకతాయి తనంతో, చిన్ని చిన్ని కారణాలతో తాళిని ఎగతాళి చేసి బంధాన్ని అనుబంధాన్ని హేళన చేయకండి. ఒకసారి తాళి తెంచి వెళితే విధవతో సమానం.. ఇక్కడ ఒకమాట చెప్పాలి.. కొంచం బాధ కలిగించవచ్చు.. కానీ భవిష్యపురణం చెబుతుంది..

Tuesday, 3 December 2013

నీతికథ

ఒక ఊరిలో రంగయ్య, రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగవులు వస్తే వీరే తీర్చేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా, బాదం పప్పు పెట్టి  పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. ఐతే ఈకోడిని ఎలాగైనా సేమ్య ఉప్మా లాగా లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ వుండేది. ఈవిషయం గమనించి రంగయ్యని భార్య హెచ్చరించింది. వినలేదు. ఒకరోజు పిచ్చుక ఒకటి అక్కడికి వచ్చి మేత తింటుంటే పిల్లి మీదపడి కొరికింది. పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య చూసి తీసి అవతల పడేశాడు. భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. ఎందుకే అలా కూర్చున్నావు. ఏమైంది.  అంటే ఆపిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికిమాలిన పిల్లి కొరికి చంపింది. అన్నది. రంగయ్య నవ్వి! ఒసేయ్ పిచ్చి మొగమా! పుట్టిన ప్రతిజీవి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందేనే. ఎవరూ శాశ్వతంగా ఉండరు. దీనికేందుకే ఏడుస్తావ్. అనగానే రంగమ్మకి మండిపోయింది. ఏదో ఒకరోజు ఆ పిల్లి సంగతి చుడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వేసి పెంచుతున్న కోడిని రంగయ్య చూస్తూ ఉండగానే పిల్లి కచక్ మని కొరికింది. అది చూసి రంగయ్య చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకొని పిల్లిమీదకి విసిరాడు. అది కాస్త గురితప్పి కొనఊపిరితో ఉన్న కోడికి తగిలింది. కోడి చచ్చింది. ఇక చుడండి ఒకటే ఏడుపు. నాకోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడీ. ఆపిల్లి కోరికేసింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్గాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏమి జరిగింది ఆ దీర్గాలు ఏంటి? అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూ చూడవే! నాకోడిని ఆదిక్కుమాలిన పిల్లి చంపేసింది. రంగమ్మ నవ్వి! పోనివ్వండి.. ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే? రంగయ్య! ఆపిచ్చిక నాదా! అందుకే ఏడవలేదు. ఈకోడికి రోజు పప్పులు పెట్టి ప్రేమగా  పెంచుకున్నాను. అనగానే రంగమ్మ పగలబడి నవ్వి!


Saturday, 17 August 2013

పిడికెడు అటుకులతో సంతుష్టుడైన కృష్ణుడు!

      'ఉంది', 'లేదు'... ఇవి రెండూ చదవటానికి చిన్న పదాలైనా ఇవి జీవితాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మనిషి జీవితంలో సుఖసంతోషాలకు, వేదన రోదనలకు 'ఉంది', 'లేదు' అనే భావనలో కారణం. ఉందనుకుంటే తృప్తి, ఆపై జీవితంలోని బాదరబందీల నుంచి విముక్తి. లేదనుకుంటే అసంతృప్తి. చివరికి కలిగేది జీవితంపై విరక్తి. నిజానికి 'ఉంది', 'లేదు' అనేవి మనం సృష్టించుకున్న భావనలే. జీవితంలో సుఖ దు:ఖాలు, కలిమిలేములు వచ్చిపోతుం టాయి. అదో చక్రం. జీవితం పొడవునా అవి పలక రిస్తూనే ఉంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండిపోవు. కొందరు తగినంత ఉండి, ఏ లోటూ లేకున్నా 'ఇంకా కావాలి...సరిపోదు' అని చింతిస్తారు. ఉండి కూడా లేదనుకుని బాధపడ తారు. లేదు.. లేదనుకుంటే చివరికి లేకుండానే పోతుంది. ఉన్నదెంతైనా సాటి వారితో పంచుకుంటేనే అందం, ఆనందం. హేమాడ్‌ పంత్‌కు బాబా చెప్పినట్లే, కృష్ణుడు సుదా మునికి ఈ విష యంలో నిదర్శనం చూపాడు.  కృష్ణుడు,బలరాముడు, సుదాముడు సాందీపుని శిష్యులు. గురువు సాందీపుడు ముగ్గురినీ అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని రమ్మని పంపారు. సాందీపుని సతీమణి ఆకలి వేస్తే ముగ్గురూ తినండని చెప్పి శనగలు మూటకట్టి సుధా మునికి ఇచ్చింది. కృష్ణ, బలరామ, సుధా ములు అడవిలో తిరుగుతూ అలసిపోయారు.