Saturday, 17 August 2013

పిడికెడు అటుకులతో సంతుష్టుడైన కృష్ణుడు!

      'ఉంది', 'లేదు'... ఇవి రెండూ చదవటానికి చిన్న పదాలైనా ఇవి జీవితాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. మనిషి జీవితంలో సుఖసంతోషాలకు, వేదన రోదనలకు 'ఉంది', 'లేదు' అనే భావనలో కారణం. ఉందనుకుంటే తృప్తి, ఆపై జీవితంలోని బాదరబందీల నుంచి విముక్తి. లేదనుకుంటే అసంతృప్తి. చివరికి కలిగేది జీవితంపై విరక్తి. నిజానికి 'ఉంది', 'లేదు' అనేవి మనం సృష్టించుకున్న భావనలే. జీవితంలో సుఖ దు:ఖాలు, కలిమిలేములు వచ్చిపోతుం టాయి. అదో చక్రం. జీవితం పొడవునా అవి పలక రిస్తూనే ఉంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండిపోవు. కొందరు తగినంత ఉండి, ఏ లోటూ లేకున్నా 'ఇంకా కావాలి...సరిపోదు' అని చింతిస్తారు. ఉండి కూడా లేదనుకుని బాధపడ తారు. లేదు.. లేదనుకుంటే చివరికి లేకుండానే పోతుంది. ఉన్నదెంతైనా సాటి వారితో పంచుకుంటేనే అందం, ఆనందం. హేమాడ్‌ పంత్‌కు బాబా చెప్పినట్లే, కృష్ణుడు సుదా మునికి ఈ విష యంలో నిదర్శనం చూపాడు.  కృష్ణుడు,బలరాముడు, సుదాముడు సాందీపుని శిష్యులు. గురువు సాందీపుడు ముగ్గురినీ అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని రమ్మని పంపారు. సాందీపుని సతీమణి ఆకలి వేస్తే ముగ్గురూ తినండని చెప్పి శనగలు మూటకట్టి సుధా మునికి ఇచ్చింది. కృష్ణ, బలరామ, సుధా ములు అడవిలో తిరుగుతూ అలసిపోయారు.


మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? శాశ్వత ఆనందం సాధించాలంటే ఎం చేయాలి?

సంపద ఉన్నప్పుడే ఇది శాశ్వతం కాదు అని గ్రహించినపుడు సంతోషంగా జీవించగాలుగుతాడు! ఒక్కొక్కపుడు కొందరికి సంపద అయాచితంగా వస్తుంది! ఒక్కోకపుడు వస్తుంది అనుకున్నది కూడా అందకుండా పోతుంది! పని అయినట్టే ఉంటుంది కానీ అవ్వదు! ఇంకోసారి అవ్వదు అనుకున్న పని అయిపోతుంది! తల్లి తండ్రులు, బంధువులు మన కళ్ళముందే మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతుంటే ఎలా చూస్తూ ఉంటున్నామో! సంపద కూడా అంతే! ఒక మత్తేభం(ఏనుగు) నీటిలోకి దిగిందనుకోండి నీరు బురద మయం అవుతుంది! ఆ మత్తేభం వెళ్ళిపోయిన కొద్ది సేపటికి తేట నీరు పైకి వస్తుంది! మనకున్న కష్టాలు, సుఖాలు కూడా అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి! వీటన్నిటిని సమదృష్టితో చూసినప్పుడు ఎలాంటి కష్టాలు నీ దరికి చేరవు

సంపద వుంది కదా అని విర్రవీగ కూడదు!

ఒక లోట్టిపిట్ట బ్రహ్మకోసం తప్పస్సు చేసింది! దాని తపస్సుకి మెచ్చి ఏదన్న వరం కోరుకోమన్నాడు! ఆ ఒంటె నోరు యోజనాల దూరం సాగే మెడ కావాలి అని కోరుకుంది! బ్రహ్మ ప్రమాదం అని ఎంత వద్దు అని వారించిన వినలేదు! సరే అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు! దాంతో అహంకారం పెరిగింది! ఎవరన్న ఏదన్న పెడతాను అని ఏదన్న తీసుకొస్తే! మీరు నాకు పెట్టేది ఏంటి? నా మెడ నూరు యోజనాల దూరం సాగుతుంది! నేనే సంపాదించుకుంటా అని పొగరుగా చెప్పేది! ఈ మెడ సాగటం వల్ల ఎక్కడికి కదిలేది కాదు! బద్ధకం పెరిగింది! అలసత్వం ఎక్కువైంది! దీని అహం వల్ల చుట్టూ ఉన్నవారంతా శత్రువులు అయ్యారు! ఒకరోజు బారి తుఫాన్ వచ్చింది! అందరు వెళ్లి ఎక్కడ పొద వుంటే అక్కడ దాక్కున్నారు! ఇదిమాత్రం కదలకుండా తన మెడని సాగదీసి ఒక గుహలో పెట్టి ఆదమరచి నిద్రపోయింది! ఈలోపు మంచి ఆకలిమీద ఉన్న నక్కల గుంపు అక్కడివచ్చాయి! దీన్ని చూసి పీక్కు తినడం మొదలు పెట్టాయి! ఇదంతా చూస్తున్న స్నేహితులు ఒక్కరు కూడా దాన్ని లేపడానికి కూడా ప్రయత్నం చేయలేదు! ఇంతలో మెలుకువ వచ్చి మెడ తీయాలి అనుకునేలోపు మెడలో ఉన్న నరాలు పటపట తెంచెశాయి! చచ్చిపోయింది! కాబట్టి సంపద ఉందని ఎవరిని చులకన చేసి చూడకూడదు! అహంకారం తలకి ఎక్కించుకుంటే ఇలానే అవుతుంది మన పరిస్థితి కూడా! నీ దగ్గర సంపద ఉన్నపుడు చుట్టూ ఉన్నవారంతా మంచివారు కాదు! ఇది నువ్వు కనిపెట్టుకుని ఉంటే అంతా మంచే ఉండి తీరుతుంది!.. ఇంకా ఉంది!

బలవంతుడు అయిన శత్రువు దగ్గర ఎలా ఎదుర్కోవాలి?

        బలవంతుడు అయిన శత్రువు దగ్గర సమయం వచ్చే వరకు నమస్కారం పెట్టి అణిగిమణిగి ఉండాలి! స్నేహం చేయాలి! నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదు! ఎందుకంటే బలవంతుడు కాబట్టి ప్రమాదం వస్తుంది కాబట్టి! దీనికి ఒక మూషిక, మార్జాల సంవాదం ఉంది!
ఒక అడవిలో ఒక చెట్టు కింద ఉన్న బొరియలో ఎలుక నివాసం ఉంటుంది! అదే చెట్టుపైన పిల్లి నివాసం ఉంటుంది! ఎలుక పిల్లికి భోజన పదార్ధం కాబట్టి ఎప్పుడు దాని జాగ్రత్తలో అది ఉండేది! అదే అడవిలో ఒక బోయవాడు వల పన్ని దానిలో పడిన పశు పక్ష్యాదులని ఆహారంగా సంపాదించుకునేవాడు! ఒకరోజు ఆ బోయి వలలో పిల్లి చిక్కుంది! అదిచూసిన మూషికం ఆనందంతో అటు ఇటు తిరుగుతూ ఉంది! ఇంతలో గుడ్లగూబ, ముంగిస దాన్ని చూసి తినేయడానికి ముందుకు వస్తుంటే అది గమనించిన ఎలుక పిల్లితో సంధికి వచ్చింది! నీవాలని నేను తుత్తినియలు చేసి నిన్ను రక్షిస్తాను! అదుగో ముంగిస, గుడ్లగూబ నన్ను చంపి భక్షించాలని చూస్తున్నాయి! నేను నీ దగ్గర ఉంటే అవి నా దగ్గరికి రావు! ఏమంటావ్ మిత్రమా? సరే అని సంధికి ఒప్పుకుంది మార్జాలం! కొంతసేపటి వరకు ఎదురుచూసి ఆరెండు వెళ్ళిపోయాయి! ఆనందంతో గంతులు వేస్తూ అటు ఇటు తిరుగుతుంది ఎలుక! అది చుసిన పిల్లి మిత్రమా! మన సంధి విషయం మరచి ఇలా నన్ను వదిలేయడం ఏమైనా బాగుందా? ఇది న్యాయమేనా అని అడిగింది! దానికి ఎలుక వాళ్ళిద్దరిని చూసేసరికి నాగుండె ఆగినంత పని అయ్యింది! అందుకే కొద్దిగా ద#సేద తీరుతున్నాను! ఈలోపు నీకు ఈ తొందరపాటు ఏలా? కొంతసేపు ఆగు మిత్రమా! అదివిని పిల్లి మిత్రమా నీ ప్రాణం నిలబెట్టుకున్నావు కానీ నా నా ప్రాణం పోయేలా ఉంది రక్షించు! దానికి ఎలుక మిత్రమా ఆవలని తుత్తునియలు చేయడం నాకు చిన్నపాటి విషయం కొంత ఓర్పు వహించు! ఈలోపు ఆ బోయ నలుగు కుక్కలని వేసుకొని ఒక పెద్ద గొడ్డలితో రావడం చూసి మిత్రమా అదిగో సాక్షాత్తు ఆ యమ దైవతమే నాకోసం వస్తున్నట్టు ఉంది అనగానే ఎలుక గబగబా ఆ వలని కొరికి బోయలోకి వెళ్ళిపోయింది! పిల్లి చెట్టు మీదకి పరిగెత్తింది! ముక్కలు అయిన ఆ వలని చూసి బోయవాడు బాధపడి వెళ్ళిపోయాడు! కొంతసేపటికి పిల్లి కిందకి వచ్చి మిత్రమా నా ప్రాణాలు కాపాడిన నీకు నా ధన్యవాదాలు! నేటి నుండి నావల్ల నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు! బయటకి రా మిత్రమా!
దానికి బదులుగా ఎలుక నా ప్రాణాలు నువ్వు కాపాడావు! నీ ప్రాణాలు నేను కాపాడాను ఇంకా ఇంతటితో నీకు నాకు చెల్లు వెళ్ళు! పిల్లి మృదు మధుర స్వరంతో మిత్రమా నీకు ఈ లేనిపోని ఆందోళన ఎందుకు? నా ప్రాణాలు కాపాడిన ప్రతిఫలం దక్కించుకో! నిన్ను నా భంధవులకి పరిచయం చేస్తాను! ఐశ్వర్యాలు ఇస్తాను, సత్కారాలు చేస్తాను! నిన్ను గౌరవంగా చూసుకుంటాను అంది! కానీ ఎలుక! మిత్రమా నువ్వు ఇప్పుడు నేను నీ ప్రాణాలు కాపాడిన కృతజ్ఞత ఉండొచ్చు! కానీ నేను నీకు భోజ వస్తువుని! నాకంటే నువ్వు బలవంతుడివి! దానికి తోడు నిన్న రాత్రి వలలో చిక్కుకున్నావు! ఆకలి మీద వున్నావ్! నేను బయటకి వచ్చిన వెంటనే నా పైబడి చంపేయగలవు! ఇప్పుడు కాకపోయినా తరువాత అయిన నా ప్రాణాలు హరించగలవ్! బలవంతుడు అయిన శత్రువుతో చెలిమి ప్రాణ సంకటం! అవసరం కోసం ఆశ్రయించవచ్చు కానీ కలకాలం స్నేహం కొనసాగించరాదు! కాబట్టి ఇక నీవు మరలిపోవచ్చు! నీకు నాకు స్నేహం కద్దు! ఆ మాటలకి పిల్లి సిగ్గుపడి వెళ్ళిపోయింది! ఎలుక ఇంకా ఈ బొరియలో ఉండటం మంచిది కాదని వేరొకచోట నెలవు ఏర్పరచుకొని సంతోషంగా జీవించింది!
కాబట్టి బలవంతుడు అయిన శత్రువుతో ఎల్లకాలం స్నేహం చేయకుండా, తగవులు పెంచుకోకుండా సందర్బాన్ని బట్టి లోంగినట్టు ఉంటూ స్నేహాన్ని అవసరం మేర చేసి తరువాత రామ్ రాం చెప్పేయాలి!

స్నేహబలం

   హిరణ్యకుడు అను ఎలుక, చిత్రాంగుడు అనే జింక, మంథరుడు అనే తాబేలు, లఘుపతకము అనే కాకి వీళ్ళు నలుగురు మిత్రులు. కర్పూర గౌరవము అనే చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ ప్రక్కనే ఉన్న పొదలో జింక ఉండేది.
సాయంత్రపు పూట ఈ నలుగురు మిత్రులు ఒకేచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్నమనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతున్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలా సేపు ఎదురుచూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు.
'స్నేహితులారా! చిత్రాంగుడు ఇంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకొని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. 'అవును నిజమే!' అన్నాయి ఎలుక, కాకి. 'ఇప్పుడు ఏం చేద్దాం!' అనుకున్నాయి ఆ మూడు. స్నేహితులారా! నేను ఎగిరివెళ్ళి అడవంతా చూసివస్తాను' అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరింది.
తాబేలు, ఎలుక చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒకచోట జింక కనిపించిది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కికుపొయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో 'వచ్చావా! లఘుపతనకము ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను నన్ను రక్షించవా' అంది. 'భయపడకు చిత్రాంగా! నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుడిని తీసుకువస్తాను అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు!' అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోకి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది.
ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ తమ ఇళ్ళ వైపు నడిచారు. దారిలో వాళ్ళకి తాబేలు ఎదురుపడింది. అయ్యో! మంధరా నువ్వెందుకు వచ్చావు అనడిగాడు హిరణ్యకుడు. 'చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాతంగా కూర్చోలేకపోయాను.
మీరిద్దరూ చిత్రాంగుడిని రక్షిస్తారని నాకు తెలుసు. అయినా మనసు ఊరుకోలేదు. అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంథరుడు. 'నువ్వు నిజమైన స్నేహితుడివీ అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంథరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురూ అనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇంటి దారి పట్టారు. కొంతదూరం ఆ నలుగురు నడిచే సరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదలోకి దూరిపోయింది. కాకి ప్రక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది, ఎలుక ప్రక్కనే ఉన్నకలుగులోకి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటూ పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది.
జింక తప్పించుకున్నా తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకొని ఇంటి దారిపట్టాడు. వేటగాడు కొంతదూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక్కచోట చేరి 'అయ్యో! చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంథరుడు వీడి చేతికి దొరికాడే' అనుకుని బాధపడ్డాయి.
అప్పుడు హిరణ్యకుడు 'స్నేహితులారా! మన మంథరుడిని రక్షించుకుంటానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. 'హిరణ్యకా! తొందరగా ఆ ఉపాయం చెప్పు అంది కాకి. 'వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకుంటానికి మంథరుడిని కట్టిన బాణం క్రింద పెట్టి వెళతాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంథరుడిని తప్పిస్తాను' అని చెప్పింది.
ఆ ఉపాయం ఎలుకకి, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారిలో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకొంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లు నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూసాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకొని 'ఆహా! ఏమి నా భాగ్యం. ఈ రోజు అదృష్టం నా పక్షాన ఉంది అందుకే వలలో జింక తప్పించుకున్నా ఇక్కడ మరొక జింక దిరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు.

వెంటనే ఎలుక వచ్చి తాబేలుకి కట్టిన తాడును కొరికేసింది. కాకి 'కావ్! కావ్'మని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు కొయ్యబారి పోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూసాడు. అప్పటికే తాబేలు ప్రక్కనే ఉన్న చెరువులోకి పారిపోయింది.
'ఆహా! ఏమి నా దురదృష్టం చేతిలో వున్న దానిని వొదులుకున్నాను అనుకొంటూ ఆ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు.
ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూసారా! స్నేహం అంటే ఈ నాలుగు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు పదిమంది ఉండే కంటే అవసరంలో ఆదుకొనే స్నేహితుడు ఒక్కడుంటే చాలు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.

సంఘటన కేవలం నిమిత్తం(కారణం) మాత్రమే!

ఎవరో ఎవరినో చంపారు! ఎవరో ఎవరికోసమో చనిపోయారు! ఎవరో ప్రమాదం జరిగో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాని, కారణం ఏదైనా కావచ్చు పలానా దానికోసం చనిపోయారు అని అనుకుంటాం! అవసరం అనుకుంటే గొడవలు, కొట్లాటలకి దిగి అన్ని ద్వంశం చేస్తున్నాం! ఇది అందరికి తెలిసిందే! అందరు చుస్తుందే! ఈ విషయం మీద ఆద్యత్మికంగా ఆలోచిద్దాం!
మహాభారతం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నపుడు ద్రోణ పర్వంలో కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు అర్జునుడు! నేను చంపాలని బాణం వేస్తుంటే నాకంటే ముందే ఎవరో ఆ బాణం మీద కూర్చొని శూలంతో పొడిచిన తరువాత నేను వేసిన బాణం గుచ్చుకుంటుంది! ఎవరు నాకంటే ముందు వాళ్ళని చంపుతుంది?
ఈ సృష్టిలో ఎవరు ఎవరిని చంపలేరు! చంపాము అని మీరు అనుకుంటారు! లేదా ఏదో ఒక కారణం చూపించి అలా జరిగి ఉండకపోతే, ఇలా జరిగి ఉండకపోతే చనిపోయేవారు కాదు అని! చంపేది, చంపించేది తను చేసిన పాపపుణ్యాలు ఫలితాలు! ప్రతి మనిషికి తను చేసిన పాప పుణ్యాల ఫలితంగా వారి వారి జీవితం ఆధారపడి ఉంటుంది! దాన్ని బట్టి ఎదోవిదంగా వాళ్ళు చనిపోవలసిందే! వాళ్ళు చనిపోయే కారణాలు కేవలం నిమిత్తాలు మాత్రమే!
ఇప్పటి వరకు మీరు కలిసి మాట్లాడుకున్నారు! కానీ ఇంతలో ఏదో చిన్న పనిబడి బయటకి పంపించారు! వాడు వెళ్ళే దారిలో అనుకోని ప్రమాదం జరిగి చనిపోయాడు! ఆవిషయం తెలిసి అయ్యో పంపించకపోయినా బాగుండేది బ్రతికుండేవాడు అనుకుంటారు! కానీ వీడు ఇక్కడ వున్నా చనిపోవలసిందే! కాకపోతే ప్రమాదంలో చనిపోయాడు! అదే నిమిత్తం అంటే!మీరు ఆపాలనుకున్నా ఆపలేరు, చేయాలనుకున్న చేయలేరు! జరిగిన సంఘటన కేవలం నిమిత్తం(కారణం) మాత్రమే!

క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవ్ - 1

పూర్వం ఒక బ్రాహానోత్తముడు తన వ్రుత్తి వదిలి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు! కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు! అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారాలు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతోపాటు బయలుదేరాడు!అలా కొంత దూరం వెళ్ళిన తరువాతఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి ఉరికి కొందరిని తొక్కేసింది! అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు! ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది! వెళ్లి దానికింద విశ్రాంతి తీసుకున్నాడు! ఆ చెట్టు మీద నాడిజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది! ఆ కొంగ ఇతనిని చూసి మిత్రమా ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు! నేను ఒక బ్రాహ్మణుడిని, నాకులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను! వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది! నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను! అని తన ఆవేదనని విన్నవించుకొన్నాడు! అది విన్న నాడిజంగుడు మిత్రమా బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం ఈనాలుగు మానవుడి అభివృద్దికి తోడ్పతాయని ధర్మ శాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా ఒక్కానిస్తున్నారు! ఈ నాలుగింటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి! నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో ఏడు మాటలు మాట్లాడవు కనుక నువ్వు నామిత్రుడివి సందేహంలేదు! కాబట్టి నేను ఇచ్చిన ఆతిద్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో! ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం! అని తనగూటికి తను వెళ్ళిపోయింది! బ్రాహ్మణుడు ఆతిద్యమిచ్చిన తీయతీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు, స్వీకరించి నిద్రపోయాడు! ఇంకా ఉంది

క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవ్ - 2

కొనసాగింపు...
తెల్లారిన తరువాత నడిజంగుడు వచ్చి బ్రాహ్మణుడితో ఇక్కడికి దగ్గరలో న మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు! అతను ఎంతో ఉత్తముడు, నియమ నిష్టలతో యజ్ఞ యగాదులతో, దానధర్మలలో ఆయనకి ఆయనే సాటి!! ప్రతి కార్తిక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు! మళ్లి అతిధి సత్కారాలు ఆచరిస్తాడు! నాకు మంచి మిత్రుడు! నేను పంపానని చెప్పు! నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు! వాటితో నువ్వు హాయిగా బ్రతకొచ్చు! ఇదిగో ఈ దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది! ఆ మర్గంగుండా చాల దూరం వెళ్ళాక నాడిజంగుడు చెప్పిన విరుపాక్షుడు రాజ్యం వచ్చింది! ఆ రాజ్యంలోకి ప్రవేసిస్తుండగానే విరుపాక్షుడు ఇతడి రూపం చూసి ఇతడిని చుస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగినవాడు అని సందేహం కలుగుతుంది! విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుడిని పంపించాడు! బటుడికి నాడిజంగుడు పంపిన విషయం చెప్పగానే ఈ వార్త విరుపక్షుడికి చెప్తాడు! విరూపాక్షుడునాడిజంగుడు పంపించడా? అయితే ఎంతటి పనికిమాలినవాడు అయిన పర్వాలేదు ప్రవేశపెట్టు అన్నాడు! బ్రాహ్మణుడు రాగానే ఎవరు నువ్వు ఏమిటి నీ చరిత్ర! దానికి ఆ బ్రాహ్మణుడు నాపేరు గౌతముడు! పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని! నాకు లేని వ్యసనం లేదు తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చడం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు! విరుపాక్షుడు కనుబొమ్మలు విరిచి సరే నువ్వు ఎవరివైన కావచ్చు నాడిజంగుడు పంపించావ్ కనుక నిన్ను సత్కరించాలి! అని వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఇతనికి కూడా భోజనం పెట్టి పెట్టిన పళ్ళెంతో సహా మోయలేనంత వెండి, బంగారం, ధనం ఇచ్చాడు! దానికి గౌతముడు ఎంతో సంతోషించి ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మోయలేక మోయలేక నాడిజంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు! నాడిజంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేదతీర్చి అతిధి సత్కారం చేసి తన గూటికి వెళ్లి నిద్రించింది!

క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవ్ - 3

   గౌతముడు మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది! రేపు ఉదయం బయలుదేరాలి! మద్యలో ఆహారం లేదు! ఈ కొంగతో నాపని అయిపొయింది! కాబట్టి దీన్ని చంపి ఆ మాంసంతో నా ఆకలి తీర్చుకుంటే బాగుంటుంది! దీనికి తోడు ఇది బాగా కొవ్వేక్కిన కొంగ మంసంకుడా బాగా ఉంటుంది అని దొడ్డుకర్ర ఒకటి తీసుకొని చప్పుడు కాకుండా అది నిద్రిస్తున్న గూటిదగ్గరికి వెళ్లి దాని మెడ మీద టపి టపి మని చచ్చేవరకు కొట్టి దాని రెక్కలు ఊర్చి ఎముకలు పోగుపెట్టి మాంసం మూట కట్టి , హాయిగా నిద్రపోయి తెల్లారిన తరువాత బయలుదేరాడు!
ఈ సంఘటన జరిగిన రాత్రి విరూపక్షుడికి కలలో నాడిజంగుడి ఈకలు, ఎముకల పోగు కనిపించేసరికి భయపడి ఆ దుర్మార్గుడు గౌతముడు న్న స్నేహితుడిని ఎం చేశాడో అనుకుంటూ నిద్రపోయాడు! తెల్లారేసరికి నాదిజంగుడు రాకపోయేసరికి అనుమానం వచ్చి (ప్రతిరోజూ సూర్యోదయం అయ్యేసరికి నాడిజంగుడు విరుపాక్షుడి దగ్గరకి వచ్చి ధర్మ సూక్ష్మాలు గురించి చర్చించేవాడు) కొందరి బటులని ఆ వృక్షం దగ్గరకి పంపి ఎం జరిగిందో చూసి రమ్మన్నాడు! అక్కడ ఈకలు ఎముకలు పోగు ఉన్నాయని వెళ్లి చూసి వచ్చిన భటులు చెప్పేసరికి విరూపాక్షుడు ఒరేయ్ వాడు ఎంతో దూరం వెళ్లి ఉండదు! పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకురండి అన్నాడు! భటులు వెతికి పట్టుకొని తీసుకొస్తుంటే విరూపాక్షుడుఅంత దూరంలోనే చూసి వాడిని ఇక్కడికి తీసుకురాకండి! వాడిని చూస్తేనే పంచమహ పాతకాలు చుట్టుకుంటాయి! అక్కడే వాడిని చంపి ముక్కలు చేసి మీరు తినేయండి అన్నాడు!ఆ మాట విని రాజ మేము ఎంత రాక్షసులం అయిన ఈ కృతజ్ఞుడి మాంసం తినం! తింటే వీడి లక్షణాలు మాకు వస్తాయి! మేము తినం అన్నారు! సరే ఐతే ఆ ముక్కలు కుక్కలకి వేయండి అన్నాడు! వాడిని చంపి ముక్కలు చేసి కుక్కలకి వేస్తె ఆ కుక్కలు అప్పటికే రెండు రోజులనుంచి భోజం లేక నకనకలడుతున్నా వాడి మాంసం కనీసం వాసన కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లి పోయాయి! విరూపాక్షుడుమిత్రుడిని తలచుకొని బాధ పడుతుంటే ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చాడు! విరూపాక్ష ఎం జరిగింది ? ఎందుకు అల బాధపడుతున్నావ్? విరూపాక్షుడున మిత్రుడు నాదిజంగుడు మరణం నన్ను తీవ్రంగా వేదిస్తుంది! న మిత్రుడుని ఎలాగైనా బ్రతికించు అన్నాడు! విరూపాక్ష నువ్వేమి భాదపడకు! దీని వెనుక ఒక కారణం ఉన్నది! నీ మిత్రుడు బ్రహ్మకి కూడా మిత్రుడు! ఇతడు పరమ పూజ్యుడైన ఋషి! అనేక శాస్త్రాలు తెలుసుకున్న జ్ఞాని! ఒకప్పుడు బ్రహ్మలోకంలో కొద్దిగా అహంకారించాడు! దానివల్ల భూలోకంలో కొంగై పుట్టాడు! పుట్టినా ఆ మహిమ పోలేదు! ఎంతైనా ఋషి, వేదాలు తెలిసినవాడు! అందుకని బ్రహ్మ తరచుగా నాడిజంగుడిని పిలిచి వేదాలు మీద చర్చ చేస్తుండేవారు! కానీ ఈమధ్య కొన్నాళ్ళ పాటు బ్రహ్మలోకానికి వెళ్ళకపోతే బ్రహ్మకి నీ మిత్రుడిని చూడాలనిపించి ఆ దౌర్భాగ్యుడికి ఆ దుర్భుద్ది పుట్టించి చంపించాడు! కాబట్టి బ్రహ్మలోకాని వెళ్ళకపోవడం అనే అపచారం వాళ్ళ దుర్మరణం పాలయ్యాడు! విరూపాక్షుడు అయ్యో అని భాదపడుతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై నీకేమి కావాలి కోరుకో అన్నాడు ! విరూపాక్షుడు నా మిత్రుడి ప్రాణం కావాలి అన్నాడు! భాదపడకు నువ్వు ఇంతకు ముందు నీ స్నేహితుడికి ఆచరించిన ధనకాండ సమయంలో ఒక గోవు ఆ చితికి దగ్గరలో దూడకి పాలు ఇస్తుంది! అప్పుడు వచ్చిన పెనుగాలి వల్ల ఆ పాల నురగ ఆ చితిమీద పడటం వల్ల నీ మిత్రుడికి ప్రాణం వచ్చింది! ఇంకొద్ది సమయంలో అది వచ్చేస్తుంది!అనగానే రివ్వుమని నాడిజంగుడు అక్కడికి వచ్చేశాడు! విరూపాక్షుడుతన మిత్రుడిని చూసి ఆనందంతో పులకించిపోయాడు! వెంటనే నాడిజంగుడు విరూపాక్షుడతో మిత్రమా నా మిత్రుడు గౌతముడు కుశలమేనాఅని అడిగాడు! విరూపాక్షుడు వాడిని కత్తికొ కండగా నరికి కుక్కలకి వేశాను అన్నాడు! అప్పుడు ఇంద్రుడు కుడా వాడు చచ్చాడయ్యా! వాడిని భయంకర యాతన దేహంలో పెట్టి యమలోకానికి ఈడ్చుకుపోతున్నారు! అక్కడ పరమ భయంకరమైన యమదండన లు అనుభవిస్తాడు అన్నాడు ఇంద్రుడు! వెంటనే నాడిజంగుడు బ్రహ్మ కాళ్ళు పట్టుకొని అయ్యా నాకోసం వాడిని క్షమించండి!వాడు పదికాలాల పాటు సుఖంగా ఉంటాడని బంగారం, మణులు ఇప్పించాను! వాడికేదో దుర్భుద్ది ఆ సమయంలో పుట్టింది! ఆ దుర్భుద్ది కూడా వాడిది కాదు ! నేను బ్రహ్మకి చేసిన అపచారం వాల్ల పుట్టింది అని నాకు అనిపిస్తుంది! ఏమైనా ఆ పుణ్యాత్ముడు సుఖం గా ఉంటే చూడాలని నాకోరిక, నాకోసం బ్రతికించండి అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు! అసలు నీలాంటి ఉత్తములు ఉంటారా? అసలు ప్రాణం తీసిన వాడిని బ్రతికించు అంటున్నావ్! సర్లే అని వాడి ప్రాణం వాడికి ఇచ్చాడు! గౌతముడు బ్రతికి లేచాడో లేదో ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మళ్లి లాక్కుంటారు ఏమో అని ముందుకి వెనక్కి చూసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ అడవి మార్గం గుండా వెళిపోయాడు!
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో తెలుసుకోవాలి! ఎంతటి ధర్మతుడైన నిచ్యులని చేరదీస్తే ప్రమాదం వస్తుంది! కష్టాల పాలు అవుతారు! అయినా అనుక్షణం జాగరూకులై వుండాలి!

స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?

నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు

Yaksha Prasna

ధర్మరాజునకి యక్షుడు వేసిన ప్రశ్న!
ఏదైనా గొప్ప ఆశ్చర్యకర విషయం చెప్పు! అందరికి తెలిసుండాలి! కానీ ఆశ్చర్యపోవాలి!
ప్రపంచం అనే మూకుట్లో సూర్యుడు చంద్రుడు అనే సెగ పెట్టి కాలం వండుతుంది! ఆశ ఋతు అనే గరిటెతో తిప్పుతూ నిత్యం వండుతుంది! ఇందులో వండేది ఎవరిని అంటే భూతల ప్రాణికోటిని! అంటే మనం అంతా ఎక్కడ వున్నాం అంటే బానంలో ఉన్నాం! ఎందుకు ఎలా వేగుతున్నాం అంటే ఒక తేనెటీగ తేనెకోసం ఒక గిన్నె అంచున నిలబడి కొద్ది కొద్దిగా లోపలకి వస్తుంటే ఆ తేనే తన ఆకర్షణతో లోపలి లాగి మింగినట్టు ప్రాణికోటి అంతా మోహం మొహం అనే తేనే కోసం ఆరాటపడుతూ వేగిపోతున్నారు! ఇందులో బాగా వేగిన అంటే సర్వం మాయ అని తెలుసుకున్నవాడిని ఆ గరిటె తీసి బయట పడేస్తుంది! అంటే ఇంకా చావు పుట్టుకలు లేకుండా మోక్షపదం చేరుస్తుంది! ఎవరైతే జ్ఞానమనే సంపదతో మాయ అనే ప్రపంచం నుండి బయట పడతారో వారినే కాలం అనే గరిటె బయట పడేస్తుంది! ఇది నిత్యం, ఇది సత్యం, ప్రతిరోజూ ఇదే కొత్త విషయం.. ఇంతకుమించి కొత్త విషయం ఇంకొకటి లేదు! ఉండదు ... అందరికి తెలిసిన విషయం, తెలియని విషయం, అర్ధంకాని విషయం!ఆశ్చర్యకర విషయం!

లక్ష్మణ దేవర నవ్వు

రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని” ఏందుకు నవ్వేవు సోదరా?” అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర “అన్నా!’ సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.’ దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ ‘పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు” అన్నాడు. దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.

అందరి మన్సులూ తేలికపడ్డాయి.సమయమూ సందర్భమూ కాని నవ్వు అపార్ధాలకి దారి తీస్తుంది కదా! తస్మాత్ జాగ్రత!!!

అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం

అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం (యజ్ఞంలో ఇచ్చేది సోమపానం).. సురాపానం తగినవారికి పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!అది ఎలాగో ఈ క్రింద చెప్పబోయే ఇతిహాసం చుస్తే తెలుస్తుంది!
సృష్టి ప్రారంభం అయిన తరువాత ఒకసారి దేవతలకి, అసురులకి యుద్ధం జరిగింది! ఆ యుద్ధంలో దేవతలు అసురులని చంపుతున్నారు! కానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది! అయితే దేవతలకి అనుమానం కలిగింది! ఇదేంట్రా బాబు మనం సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారు! అసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షస గురువు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బ్రతికిస్తున్నాడని తెలిసింది! అప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకుంటే బాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉంది! మీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని మంత్రం నేర్చుకోండి.. అనగానే దేవతలు భయపడి అయ్యబాబోయి శుక్రాచార్యుడ రాక్షస గురువు అయన! మనమంటే నేర్పడు! కాబట్టి ఇంకో మార్గం అలోచించి చెప్పండి అన్నారు! అయితే మీరు వెళ్లి బృహస్పతిని కలిసి విషయం నేను చెప్పానని చెప్పండి అనగానే దేవతలంత వెళ్లి బృహస్పతిని కలిసి విషయం చెప్పారు! బృహస్పతి అలోచించి తన కొడుకుని పంపిస్తానన్నాడు! దేవతలు సంతోషించి వెళ్ళిపోయారు! ఆ తరువాత బృహస్పతి తనకోడుకుని శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి విద్య అభ్యసించి రమ్మన్నాడు! కొడుకు తన తండ్రికి వినయంతో నమస్కరించి వీడ్కొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు! గుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తె దమయంతి కుర్చుని ఉంది! ఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ ఆ అందం చూసి మురిసిపోయి సిగ్గుపడి కుడికాలి బొటనవ్రేలు నేలపై రాస్తూఉంది! అది గమనించి నేను గురువుగారిని చూడటానికి వచ్చాను! ఎక్కడున్నారో తెలుపండి! దమయంతి సిగ్గుపడి లోపలున్నాడని చెప్పి సిగ్గుపడుతూ చెంగు చెంగు మంటూ ఎగురుకుంటూ వెళ్లి తండ్రి చాటున దాగి ఇతనినే చూస్తూ ఉంది! ఇదేమి పట్టించుకోకుండా వెళ్ళగానే గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను బృహస్పతి తనయుడిని, మీ వద్ద విద్య అభ్యసించాలనే అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను! ఆ మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వు బృహస్పతి కొడుకువా! మీ తండ్రి గారు ఉత్తములు! గొప్పవాడు! ఆపైన దేవతలకి గురువు అలాంటి బృహస్పతి కొడుకు నాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానా! తప్పకుండా నేర్పిస్తాను!
ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే? శత్రువుని అయిన తన దగ్గరికి ఆదరించాలి! విద్య అనేది తన పర భేదం లేకుండా నేర్పించాలి! శత్రువు ఎంతటి వాడైన తన గుణ గణములు పొగడవలసిందే! అలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచి ఎందుకు వచ్చామో అన్ని చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుంది! అలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా (మనకంటే ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు) ఆశ్రయించాల్సిందే!


అలా ఒక 1000 సంవత్సరాలు పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు! మరి రాక్షసులు ఊరుకుంటారా? (మనలోనే కొందరు బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలని చుస్తున్నారుకదా! వారుకూడా ఈ రాక్షస జాతిలోని వారే).. అప్పట్లో ఒక నియమం ఉండేది! విద్య నేర్చుకోవాలంటే గురువు చెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారు! ఎందుకంటే గురువు దగ్గరే ఉంటారు శిష్యులు! అన్ని పనులు పూర్తీ చేశాక విద్యాబ్యాసం మొదలు పెడతారు! ఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడు! అక్కడ రాక్షసులు వీడిని పట్టుకొని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు! సాయంత్రం అయ్యింది! దమయంతి గుమ్మం దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అని ఎదురు చూస్తుంది! ఆవులు వచ్చాయి కానీ ఇతను రాలేదు! చాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీ రావడంలేదు! అప్పటికే ఈ రాక్షసులమీద దమయంతికి ఏదైనా చేస్తారేమో అని అనుమానం ఉంది! ఏడ్చుకుంటూ వెళ్లి నన్నారు ఆయన రాలేదు అని ఏడుస్తుంది! వస్తాడులేమ్మ అని ఒదారుస్తుంటే! ఆవులు అన్ని వచ్చేశాయి కానీ అయన రాలేదు! వీళ్ళు ఆయన్ని ఏదైనా చేశారేమో నాన్న అని మళ్ళి మళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూడలేక శుక్రాచార్యుడు కళ్ళు మూసుకొని మొత్తం వెతికాడు! అడవిలో ఒకచోట రాక్షసులు వీడిని చంపడం, చంపి చెట్టుకి కట్టేయడం అంతా తన మనోనేత్రం తో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి బ్రతికించి తీసుకుని రామన్నాడు! సంజీవని స్త్రీ రూపు దాల్చి చంపి చెట్టుకి కట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చింది! దమయంతి తండ్రిని కౌగలించుకుని కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసి సిగ్గుపడుతూ లోపలి వెళ్ళింది! శుక్రాచార్యుడు జాగ్రత్త నాయన వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఎంత చెప్పినా రాక్షస బుద్ది ఎక్కడికి పోతుంది! బయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడు! ఇలా ఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడు! గురువుగారిని వదిలిపెట్టడంలేదు! ఎలాగైనా సంజీవని మంత్రం నేర్చుకోకుండా వెళ్ళేల లేడు! అని బాగా అలోచించి ఒకనాడు ఇతను అవులని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులు అంతా ఒరేయ్ వీడిని చంపి వదిలేస్తే మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి ఈసారి కాల్చి బూడిద చేద్దాం అని చంపి భూడిద చేశారు! మళ్లి రాక్షసులకి ఒక సందేహం వచ్చింది ఒరేయ్ ఇలాకాదు కానీ ఈ బూడిద తీసుకొని గురువు గారు తాగే సురలో కలిపేద్దాం అని ఆ బూడిద తీసుకెళ్ళి సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారు! సాయంత్రం అయ్యింది ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడు! రోజు ఒక పీపా తాగితే ఆరోజు 6పీపాలు తాగాడు! దాంతో మైకం ఎక్కువ కమ్మింది! మళ్లి అదే సంఘటన! దమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు అయన రాలేదు! అని వలవలా ఏడ్చింది! శుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు! దమయంతి కూడా ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది! శుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం ప్రారంబించాడు! అడవిలో ఎక్కడ కనపడలేదు! ఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు అయిన కనపడలేదు! శుక్రాచార్యుడుకి క్రమంగా మైకం తగ్గడం మొదలయ్యింది! ఏంటి వీడు ఎక్కడ వెతికినా కనపడలేదు అని సందేహం వచ్చి తన ఉదరంలో చూశాడు! ఇంకేముంది బూడిద రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడు! మైకం దెబ్బకి దిగింది! ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు! జరిగిందంతా మనోనేత్రంతో చూసాడు! ఎంతపని చేసారు అనుకున్నాడు!దమయంతికి విషయం చెప్పాడు! భోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని ప్రదేయపడింది! కుదరదు అన్న వినలేదు! పట్టుపట్టింది! సరే అని తన ఉదరంలో ఉన్న శిష్యుడిని బ్రతికించాడు కానీ బయటకి తీసుకురావాలంటే కుదరదు ఎలా? బాగా అలోచించి శిష్యుడితో నాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవనిని నేర్పించేవాడిని కాదు! కాని తప్పడంలేదు! నువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు! ఈ విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా నేను చచ్చి పోతాను! కాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత సంజీవని విద్య విద్య నేర్పించాడు! అది నేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి వచ్చి గురువు గారిని బ్రతికించాడు!
శుక్రాచార్యుడు శిష్యుడిని మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన ఈ మద్యాన్ని(సుర) ఎవరు సేవిస్తారో (త్రాగుతారో) వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాక! సకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకం, బ్రూణ హత్య ఇలాంటి పాతకాలు) ఇలా సకల పాతకాలు చుట్టుకొను గాక అని ఘోరమైన శాపం పెట్టాడు! ఆనతి నుండి సుర తగినవారికి మనో నిగ్రహం కోల్పోయి ఏమి మాట్లాడతారో, ఏమి చేస్తారో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు! కొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు! ఇవన్ని ఆ శాప ప్రభావమే!
ఇక వచ్చిన పని అయిపొయింది కాబట్టి వెళ్లి వస్తాను గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడు! దమయంతి చూసి నన్నారు నేను ఇతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను! అంటే శిష్యుడు ఆ మాట విని గురు పుత్రి సోదరితో సమానం, పోనీ అలాకాదు అనుకున్న నేను మీ తండ్రి గర్బమ్ నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను అల చూసుకున్నా నువ్వు నాకు సోదరివి అవుతావ్ కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన కోపం వచ్చి నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగ పడకుండుగాక! అని శాపం పెట్టింది! దానికి ప్రతి శాపంగా నాకు తప్ప అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక అని ప్రతిశాపం పెట్టి వెళ్ళిపోయాడు!
అలా సుర తగిన వారికీ సకల పాతకాలు చుట్టుకోవాలనే శాపం,
దమయంతి శాపం,ఇతని ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!

Neethikathalu : 1

విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది

ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.
ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.
శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ… ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.
రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.
దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ
ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.
అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు